Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘నోటా’ సెటైర్లపై స్పందించిన విజయ్ దేవరకొండ.. విమర్శకులకు వార్నింగ్!

  • ప్రేక్షకులు, మీడియా బ్రహ్మరథం పడుతోందని వ్యాఖ్య
  • థియేటర్లకు వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు
  • తాను మళ్లీ విజయంతో వస్తానని వ్యాఖ్య
సెన్సేషనల్ స్టార్ విజయదేవరకొండ నటించిన ‘నోటా’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ నటన, సినిమా కలెక్షన్లపై కొందరు దెప్పిపొడవడంపై విజయ్ దేవరకొండ స్పందించాడు. తన వ్యతిరేకులు ఇప్పుడే పండగ చేసుకోవాలనీ, ఎందుకంటే తాను మళ్లీ తిరిగి వస్తానని ట్వీట్ చేశాడు.

ఈరోజు ట్విట్టర్ లో విజయ్ స్పందిస్తూ.. ‘నా కోసం థియేటర్‌కు వెళ్లి నోటా సినిమా చూస్తున్న వారికి నా ప్రేమను తెలుపుతున్నా. ఇతరులు, పరాజయం పొందాలని ఆశలు పెట్టుకున్న వారు ఇప్పుడే వేడుకలు చేసుకోండి. నేను సాకులు చెప్పను, బాధ్యత తీసుకుంటా. నోటా విషయంలో నేను గర్వంగా ఉన్నాను. ఇది మీకు నేను చెప్పాలి, చూపించాలి అనుకున్న కథ. తమిళనాడు, జాతీయ వార్తా పత్రికలు, ప్రేక్షకులు నోటాను విశేషంగా ఆదరిస్తున్నారు. నాపై వచ్చిన విమర్శలను సీరియస్ గా శోధించా. నాపరంగా చేసిన తప్పులను సరిదిద్దుకున్నా. సరైన నిర్ణయం తీసుకుని పనిచేస్తున్నా. అంతమాత్రాన నా స్వభావం మారదు.

జయాపజయాలు రౌడీని తయారు చేయలేవు. కాబట్టి అవి నన్ను బ్రేక్ కూడా చేయలేవు. రౌడీగా ఉండటం అంటే విజయం పొందడం మాత్రమే కాదు. ఆ విజయం కోసం పోరాడటం. ఇది మనలోని స్వభావం. కాబట్టి పోరాడుతూనే ఉందాం. గెలిస్తే గెలుస్తాం. లేదంటే నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ తరుణాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటున్న వారికి చెబుతున్నా. ఇప్పుడే పండగ చేస్కోండి. నేను మళ్లీ తిరిగి వస్తా’ అని విజయ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
Tollywood
nota
vijay devarakonda
fans

More Telugu News